IIIT Basara

నడిరోడ్డుపై కిందపడిపోయిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

ఆదిలాబాద్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు మరోసారి నిరసనల బాటపట్టారు. ఫుడ్‌ పాయిజన్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు పరామర్శించేందుకు బాసరకు వస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావును లోకేశ్వరం వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. ట్రిపుల్‌ లోపలికి వెళ్లేందుకు మరికొందరు బీజేపీ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఆందోళన చేపట్టిన విద్యార్థులకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి సంఘీభావం ప్రకటించారు. అయితే బైంసాలో పోలీసులు అడ్డుకుంటారని భావించిన రమాదేవి వారికి చిక్కకుండా ఉండేందుకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో హడావుడిగా వెళ్తుండగా నడిరోడ్డుపై ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు. తరువాత ఆమెను పైకి లేపగా.. పెద్దగా గాయాలేవి తగలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.