ఆర్ఎఎఫ్ సి ఎల్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ పర్యటన

రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో బుధవారం నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ తోట వెంకట సర్వారాయుడు ప్లాంట్లును పరిశీలించారు. ప్లాంట్లో ఉత్పత్తి, రవాణా వివరాలను తెలుసుకున్నారు.

త్వరలో రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారాన్ని మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్బర్ కలను నెరవేర్చేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్ సిఎల్ సిజిఎం విజయ్ కుమార్ బంగార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.