గీతాంజలి కళాశాల విద్యార్థులకు పలు కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగాలు

హన్మకొండ: గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు. ఈ ఏడాది కార్పొరేట్ సంస్థలలో సుమారు 50 కి పైగా ఉద్యోగాలు సాధించి హన్మకొండ పట్టణంలో రికార్డులను తిరగరాశారు. పట్టణంలోని పెట్రోల్ పంపు కిషన్ పుర వద్ద గల గీతాంజలి కళాశాల విద్యార్థుల జైత్రయాత్ర ఓరుగల్లు కోటలో ప్రభంజనం సృష్టించింది. గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాల లో చదువుతున్న విద్యార్థినిలు పలు ఎంఎన్సి కంపెనీలు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాప్ జమిని, ఎపిసోసోర్స్ లలో ఉద్యోగాలు సాధించిన సందర్బంగా శనివారం అభినందన సభ నిర్వహించారు .ఈ కార్యక్రమమంలో విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు పాల్గొని వారి అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్బంగా కళాశాల అకాడమిక్ డైరెక్టర్ జి. వేణుమాధవ్ మాట్లాడుతూ డిగ్రీ చదువుతూనే ఉన్నతమైన కార్పొరేట్ సంస్థ లలో ఉద్యోగాలను పొందటానికి మొదటి సంవత్సరం నుంచే శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ , విద్యార్థినిలకు వివిధ కంపెనీ లకు కావలసిన నైపుణ్యతను అందిస్తూ , వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. కళాశాలలో చదివే ప్రతి విద్యార్థినికి చదువు తో పాటు , ఉద్యోగాలను పొందుటకు కృషి చేస్తూ ఉంటామన్నారు.

ఈ కార్యక్రమం లో కళాశాల డైరెక్టర్ బి. శ్రీధర్ విద్యార్థినిలను అభినందించారు. ప్రిన్సిపాల్ వి. మంజుల దేవి మాట్లాడుతూ పట్టుదల, కృషి ఉంటె సాదించలేనిదీ ఎదిలేదని, వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మరియు వారి తల్లిదండ్రుల ప్రోత్సహం కూడా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్లేసుమెంట్ అధికారి కె. లక్ష్మి చైతన్య, అధ్యాపక బృందం పాల్గొన్నారు.