వార్డ్ కౌన్సిలర్ దారుణ హత్య
మహబూబాబాద్ : పట్టణంలోని 8 వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ రవిని దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు రవిని గొడ్డలితో నరకి చంపారు. ద్విచక్రవాహనంపై బాబునాయక్ తండాలోని తన ఇంటి నుంచి మహబూబాబాద్‌కు వస్తుండగా… మార్గమధ్యలో పత్తిపాక వద్ద ఆగారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న కౌన్సిలర్ రవిపై దాడి చేసిన దుండగులు.. గొడ్డలితో నరికి పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా…. రక్తపు మడుగులో ఉన్న రవిని ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ… కౌన్సిలర్ రవి ప్రాణాలు విడిచాడు.
మున్సిపల్ ఎన్నికల్లో మహబూబాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి… బానోత్ రవి విజయం సాధించాడు. అనంతరం… తెరాసలో చేరాడు. కౌన్సిలర్ హత్యతో మహబూబాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు.