ఋతుసంబంధిత పరిశుభ్రతా ఉత్పత్తుల కోసం అవని చందా (సబ్‌స్క్రిప్షన్) మోడల్
న్యూ ఢిల్లీ: స్త్రీ సంరక్షణ, పరిశుభ్రత అంకుర బ్రాండు అవని- తన విస్తృత శ్రేణి ఉత్పత్తి అందజేతల కోసం ఒక చందా (సబ్‌స్క్రిప్షన్) మోడల్ ఆవిష్కరణను ప్రకటించింది. అవని ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ కస్టమర్ పునాది పట్ల స్పందనగా ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ను ప్రకటించింది.
బామ్మలు, ఆయుర్వేదముచే స్ఫూర్తిని పొందిన అవని ఉత్పత్తులు రజస్వల నుండి మెనోపాజ్ వరకూ బాగా-పరిశోధించబడిన, స్పృహాత్మకమైన ఉత్పత్తులుగా ఉంటున్నాయి. మహిళల కోసం ఒకే సమయంలో చర్మ-హితమైన, పర్యావరణ హితమైన, రసాయన రహితమైన వివిధ ఋతుసంబంధిత పరిశుభ్రతా ఉత్పత్తులపై అవని సబ్‌స్క్రిప్షన్‌లను అందజేస్తోంది.
సబ్‌స్క్రిప్షన్ కొరకు అందుబాటులో ఉండే శ్రేణిలో, ఋతుసంబంధిత పరిశుభ్రతను ఒక క్రమం తప్పని ఆచరణగా చేయడానికి, వాటి వాడుకదారులకు తదుపరి స్థోమతను పొడిగించడానికై ప్రముఖ ఉత్పత్తులు చేరి ఉన్నాయి. కస్టమర్లు ఎంపిక చేసుకోదగిన వివిధ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్లు ఉన్నాయి, అనగా ప్రతి నెలా లేదా ప్రతి 2 నెలలకూ లేదా ప్రతి 3 నెలలకూ ఒకసారి డెలివరీ చేయబడే విధంగా. 1.5x ఎక్కువ స్రావాలను పీల్చుకునే సహజ కాటన్ శానిటరీ ప్యాడ్ల అసలు ధర 12 ప్యాడ్లకు రు. 219/ కాగా, సబ్‌స్క్రిప్షన్ తర్వాత చెల్లించాల్సియున్న మొత్తము 12 ప్యాడ్లకు అతి తక్కువగా రు.133 గా ఉంటుంది.
“అవని వద్ద మేము మా సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ నమూనాను ప్రకటించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాము, ఎందుకంటే మా కొనుగోలుదారులు క్రమం తప్పకుండా ఏది అవసరమో దానిని కొనడానికి ఇది సౌకర్యమైన, వ్యక్తిగతీకృతమైన మరియు మరింతగా స్థోమతకు తగిన మార్గములో వీలు కలిగిస్తుంది. ఈ చొరవ కేవలం మహిళలను సాధికారపరచడానికి మాత్రమే కాదు, ఐతే పరిశుభ్రతా చర్యను మరింత నిర్వహణదాయకంగా మరియు సమర్థవంతంగా చేయడానికి కూడా. మేము త్వరలోనే అదేవిధమైన సబ్‌స్క్రిప్షన్ ఆఫర్లను ఇతర ఉత్పత్తులు అన్నింటికి కూడా ప్రారంభించబోతున్నాము,” అన్నారు, ఋతుసంబంధిత ఆరోగ్య సంరక్షణ అంకుర పరిశ్రమ- అవని సహ-వ్యవస్థాపకులు శ్రీమతి. సుజాతా పవార్.
ఋతుసంబంధిత పరిశుభ్రతా అంకుర పరిశ్రమ- అవని, ఋతుచక్రాలతో ముడిపడి ఉన్న సమస్యల పట్ల, సాధారణంగా దానితో ముడిపడి ఉన్న నిషేధం పట్ల అవగాహన కల్పించడం గురించి చురుగ్గా గళమెత్తుతోంది. ఒక పర్యావరణ హితమైన ఇ-కామర్స్ బ్రాండ్ అయిన OneGreen తో అవని తన సాహచర్యాన్ని ప్రారంభించిన వెంటనే అవని యొక్క సబ్‌స్క్రిప్షన్ ఆఫర్లు అమలుకు వస్తాయి.
అవని గురించి
2020 ఆగస్టులో మహారాష్ట్ర లోని థానేలో స్థాపించబడిన ఒక చిన్న అంకుర సంస్థ అవని, మహిళలకు సాధికారత అందిస్తూనే ఋతుసంబంధిత సంరక్షణను విషరహితం చేయడంపై దృష్టి సారిస్తోంది. సుజాతా పవార్, అపూర్వ్ అగర్వాల్ దంపతులచే స్థాపించబడిన అవని, మహిళల కోసం సృహాత్మకమైన ఋతుసంబంధిత సంరక్షణ ఉత్పాదనగా ఉంది. ఈ బ్రాండు, బహిష్టు సమయాల్లో మహిళా పరిశుభ్రతను సానుకూలపరచడానికి గాను బాగా పరిశోధించబడిన, నిత్యనూతనమైన, పరీక్షించబడిన ఉత్పత్తులను అందజేస్తోంది. వైద్య నిపుణుల మద్దతుతో, 24X7 హెల్ప్ లైన్ తో, మరియు సృహాత్మకమైన ఉత్పత్తులతో అవని, రజస్వల నుండి మెనోపాజ్ వరకూ ఒక విశ్వసనీయ మహిళా ఆరోగ్య రక్షణ బ్రాండుగా అవతరించాలని సహ-వ్యవస్థాపకులు ఆకాంక్షిస్తున్నారు.