అభివృద్ధి అంటే కురుకురే ప్యాకెట్లు పంచడం, పాసింజర్ లిప్టులు ప్రారంభించడం కాదు: కేటీఆర్
హైదరాబాద్ నగర అభివద్దిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కళ్లుండి చూడలేని పరిస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి KTR అన్నారు. నగరం నలుమూలలా అద్భుతంగా విస్తరిస్తూ అభివృద్ధి సాధిస్తుంటే చూసి ఒర్వలేక, అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. సొంత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కిషన్ రెడ్డి తత్తరబిత్తర మాట్లాడి పరువు తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నలువైపులా చరిత్రలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరుగుతుంటే కిషన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.హైదరబాద్ నగరానికి ఒక్కపైసా అదనంగా తేలేని కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విస్తృతమై అభివృద్ధిలో కేంద్రం వాట ఎంతో ప్రజలకు వివరిస్తే మంచిదని సూచించారు. అభివృద్ధి అంటే రైల్వే స్టేషన్లో మూడు లిప్టులను ప్రారంభించడం కాదని చురకలంటించారు. వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాద్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు తీసుకురాలేని నిస్సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు, సంస్థలను సొంత రాష్ట్రం గుజరాత్ కు తరలించుకుపోయిన ప్రధానమంత్రిని ఇదేందని అడగలేని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సొమ్ము తింటూ నరేంద్ర మోడీ పాట పాడుతున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం సికిందరాబాద్ లో కేంద్రప్రభుత్వ నిధులతో ఏం డెవలప్ మెంట్ చేసిండో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని దాని ఫలాలను నగర ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క ప్రాంతానికో ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని ప్రాంతాలను సమానంగా డెవలప్ చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా తాము చేస్తున్న అభివృద్ధి పనులకు యస్అర్డీపీ, యస్ఎన్డీపీ, సిఅర్ఏమ్ పి కార్యక్రమాలు, వైకుంఠ దామాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలే నిదర్శనం అన్నారు.
అభివృద్ధిలో రోజురోజు కొత్త పుంతలు తొక్కుతున్న హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపరిచేందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా రూ. 5660.57 కోట్ల వ్యయంతో 47 పనులు చేపట్టామని, అందులో ఇప్పటి వరకు 32 పనులు పూర్తయ్యాయి పూర్తి అయ్యాయన్న కేటీఆర్, ఈ సంవత్సరంలోనే 11 పనులను పూర్తి చేసి అందుబాటు లోకి తెచ్చామన్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు లేకుండా ఉండడానికి 985.45 కోట్ల వ్యయంతో యస్ ఎన్ డి పి ద్వారా నగరం చుట్టు ఉన్న మున్సిపాలిటీల్లో 56 పనులు చేపట్టగా జిహెచ్ఎంసీ పరిధిలో 35 పనులను 735 కోట్లతో చేపట్టడం జరిగిందన్నారు. పికెట్ నాలాపై నిర్మించిన బ్రిడ్జితో అనేక కాలనీలకు వరద ముప్పు తప్పిందన్నారు. ఇలా ఎల్బీనగర్ జోన్ లో 6628 పనులు, చార్మినార్ జోన్ లో 12,426 , ఖైరతాబాద్ లో 7829 , శేర్లింగంపల్లి జోన్ లో 4556, కూకట్పల్లి జూన్లో 5,159, సికింద్రాబాద్ జోన్ లో 6517 పనులు చేపట్టామన్నారు. ఇలా చెప్పుకుంటే పొతే తాము చేసిన అభివృద్ధి పనుల జాబితా అంతులేనిదని, తమ ప్రభుత్వం నగరంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. భవిష్యత్తుకు అనుగుణంగా నగరాన్ని నాలుగు దిక్కుల్లో డెవలప్ చేస్తున్నామన్న కేటీఆర్, సిటీ విస్తరణంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఐటీ, పారిశ్రామిక,ఫార్మా, సర్వీసెస్ రంగాలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తు సమ్మిళిత అభివృద్ధిని కొనసాగిస్తున్నానమని కేటీఆర్ చెప్పారు. ప్యాసింజర్ లిఫ్ట్ లను ప్రారంభించడం, కుర్ కురే ప్యాకెట్లను పంచడమే అభివృద్ధి అనుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పనికిమాలిన మాటలు బంద్ చేసి హైదరాబాద్ కు నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వనీ మోడీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డికి తమను విమర్శించే అర్హత లేనే లేదన్నారు కేటీఆర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి తన సొంత పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా అవగాహన లేదని కేటీఆర్ అన్నారు.ఇందిర పార్కు నుండి వి యస్ టి మెయిన్ రోడ్డు వరకు, అశోక్ నగర్ క్రాస్ రోడ్డు జంక్షన్ నుండి అర్ టి సి క్రాస్ రోడ్డు భాఘ్ లింగం పల్లి జంక్షన్ ఫేస్ 1 మరియు 2 లెవెల్ మూడు లేన్ల బైడైరెక్షనల్ ఇండిపెండెంట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులను రామ్ నగర్ రోడ్డు నుండి వి యస్ టి మెయిన్ రోడ్డు జంక్షన్ మీదుగా బాగ్ లింగంపల్లి వరకు 423 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పనులు జూన్ 2023 వరకు పూర్తి చేయనున్నట్లు కెటియార్ తెలిపారు. భారీగా అన్ని జోన్లతో ముఖ్యంగా పాత యంసియచ్ పరిధిలో సిఅర్ యంపి కార్యక్రమం ద్వారా రోడ్ల నిర్వహణ నిరంతరం చేపడుతున్నట్లు తెలిపారు.
తమ ప్రభుత్వం హైదరాబాద్ లో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను అతి తక్కువ కాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. అయితే సొంత నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అంబర్ పెట్ ఫ్లై ఓవర్ పనులు మూడేండ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నా అస్సలు పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ ఫ్లై ఓవర్ పనులు స్లోగా సాగడంతో రోడ్ల మీద ఏర్పడ్డ గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నా ఏ మాత్రం చలించని కిషన్ రెడ్డి, తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పై నిందలు వేయడం అజ్ఝానం, అవగాహనా రాహిత్యం తప్ప మరొకటి కాదన్నారు కేటీఆర్. భవిష్యత్తుకు అనుగుణంగా నగరాన్ని నాలుగు దిక్కుల్లో డెవలప్ చేస్తున్నామన్న కేటీఆర్, సిటీ విస్తరణంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఐటీ, పారిశ్రామిక,ఫార్మా, సర్వీసెస్ రంగాలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తు సమ్మిళిత అభివృద్ధిని కొనసాగిస్తున్నానమని కేటీఆర్ చెప్పారు. ప్యాసింజర్ లిఫ్ట్ లను ప్రారంభించడం, కుర్ కురే ప్యాకెట్లను పంచడమే అభివృద్ధి అనుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పనికిమాలిన మాటలు బంద్ చేసి హైదరాబాద్ కు నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వనీ మోడీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డికి తమను విమర్శించే అర్హత లేనే లేదన్నారు కేటీఆర్.