శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి వివేక్ వెంకటస్వామి శుభాకాంక్షలు
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి ఆశీస్సులతో ప్రతి ఇంట సుఖశాంతులు, ఐశ్వర్యం నెలకొనాలని, ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
శ్రీరాముని ఆదర్శ జీవితం మనకు ధర్మం, నిజాయితీ, న్యాయం వంటి ఉన్నత విలువలను నేర్పుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆ విలువలను మన జీవితంలో ఆచరించడం ద్వారా సమాజంలో సౌహార్దం, శాంతి మరింత బలపడుతుందని అన్నారు.
భద్రాద్రి సీతారాముల దివ్యక్షేత్రం రాష్ట్రానికి ప్రత్యేక ఆధ్యాత్మిక గుర్తింపును తీసుకొస్తోందని, ఈ పవిత్ర సందర్భంగా భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
ఈ శ్రీరామనవమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందం, శ్రేయస్సు నింపాలని ఆకాంక్షిస్తూ మంత్రి మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.
