జర్మనీ పర్యటనకు మంత్రి వివేక్ వెంకటస్వామి – తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలపై దృష్టి
హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖా మంత్రి జి. వివేక్ వెంకటస్వామి సోమవారం జర్మనీ దేశానికి ఐదు రోజుల అధికారిక పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానా కిషోర్‌తో పాటు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) పాల్గొంటోంది.
పర్యటనలో భాగంగా బృందం మంత్రి హన్నోవర్, హామెల్న్, బెర్లిన్ నగరాలను సందర్శించనుంది. ఈ సందర్భంగా జర్మనీలోని ప్రముఖ సంస్థలను సందర్శిస్తూ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాల విస్తరణపై చర్చలు జరపనున్నారు.
అదేవిధంగా, సెమినార్లు మరియు రౌండ్‌టేబుల్ సమావేశాలలో పాల్గొని నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, వర్క్‌ఫోర్స్ మొబిలిటీ వంటి కీలక అంశాలపై చర్చించారు. అలాగే జర్మనీలోని భారత రాయబార కార్యాలయం అధికారులతో సమావేశమై ద్వైపాక్షిక సహకారం, ఉద్యోగ అవకాశాల పెంపు చర్చలు జరపనున్నారు.
ఈ పర్యటన ద్వారా తెలంగాణ యువతకు రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలను కొత్త మార్గాలు అన్వేషించడం ప్రధాన లక్ష్యంగా మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు.
