New building for Ramagundam Police Commissionarate

కొత్తగా నిర్మించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధం

త్వరలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం: తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా

ఈరోజు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి నూతనంగా నిర్మించిన పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ.. సుమారు 26 కోట్ల వ్యయంతో, అధునాతన సాంకేతిక విధానంతో కొత్తగా నిర్మించిన పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని, త్వరలో చంద్రశేఖర రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు.

మిగిలిన చిన్న చిన్న పనులు ఉంటే త్వరత గతిన పూర్తిచేయాలని పోలీస్ అధికారులకు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈ ఈ శ్రీనివాస్, అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్ఐ లు మధుకర్, శ్రీధర్, విష్ణు ప్రసాద్, సిసి శ్రవణ్ కుమార్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ శ్రీనివాస్, డి ఈ విశ్వనాథ, ఏ ఈ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.