పొగాకు పై ఇరవయ్యేళ్ల పోరాటంఉద్యొగం లా ఉద్యమం”మాచన” ఓ ఉదాహ”రణo”

సిగరెట్ తాగకు.. పొగాకు మంచిది కాదు అని వైద్యులు చెప్పడం సాధారణం. అదే ఓ వైద్యేతర రంగానికి చెందిన వ్యక్తి కి మాత్రం జీవితమే పొగాకు పై రణం. ఇది ఓ నమ్మ లేని నిజం. మాచన రఘునందన్ ది పౌర సరఫరాల శాఖ లో ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ ఉద్యోగం. అందరు ఉద్యోగుల్లా డ్యూటీ అయిపోగానే ఇంటికి, లేదా కాలక్షేపం కోసం క్లబ్బుకు చేరే రకం కాదు మనం చెప్పుకుంటున్న మాచన రఘునందన్.

తన జీవితం తో మారాలి ఎన్నో జీవితాలు అని పొగాకు నియంత్రణ పథం లో ప్రయాణిస్తూ..మేం సిగరెట్, బీడీ, తంబాకు మానేస్తాం అని ప్రమాణం చేయిస్తున్నారు. సమాజ సేవ ఎలా చేయాలో స్ఫూర్తినిస్తున్నారు. ఎందరి జీవితాలనొ పొగాకు నుంచి విముక్తి చేస్తున్న ఓ అసాధారణ ఉద్యమం తన జీవితం అని చెప్పకనే చెబుతున్నారు. శనివారం నాడు ప్రపంచ కాన్సర్ దినోత్సవం సందర్భంగా రఘునందన్ నగరంలో నివసించే తన ద్విచక్ర వాహనంపై పర్యటించారు. ఎక్కడ ఎవరు దమ్ము కొట్టినా.. ఒక్క క్షణం ఆగి కంఠం లో ప్రాణాన్ని పొగాకు కు బలి చేయొద్దు అని తన కంఠ శోష గా హితవు చెబుతున్నారు. ప్రజారోగ్యం కాంక్షించే వైద్యులకు, ఆసుపత్రులకు వరల్డ్ క్యాన్సర్ డే, నో స్మోకింగ్ డే, వరల్డ్ నో టబాకో డే లు ఓ అవగాహన కలిగించే సందర్భాలు మాత్రమే. నగరంలో నివసించే, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ గత ఇరవై ఏళ్ల నుంచి పొగాకు నియంత్రణ కోసం కృషి చేస్తున్నారు.

ఆయన ఇలా తన వాహనం పై స్మోకింగ్ కిల్స్, క్విట్ టుబాకో ఆన్న సందేశం తో రాష్ట్ర వ్యాప్తంగా 5000 కిలో మీటర్లు ప్రయాణించి,500 గ్రామాల్లో వేలాది మంది ని పొగాకు, ధూమపానం మానేస్తాం అని ప్రతీణ చేయించారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. శుక్రవారం నాడు ఆయన నగరంలో పలు ప్రాంతాలలో ఇలా బైక్ పై తిరుగుతూ పొగాకు కాన్సర్ కారకం అని అవగాహన కలిగించారు. ఎంతో నిస్వార్థ సేవ చేస్తున్నా .. ఎటువంటి అవార్డులు ఆశించరు. పరిమాణం ముఖ్యం కాదు పరిణామం ప్రధానం అంటారు మాచన రఘునందన్.