అసెంబ్లీలో మంత్రి వివేక్ వెంకటస్వామి గారి వ్యాఖ్యలు
ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఒక నిర్ణయం తీసుకుంది.
దీని వల్ల మన రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నారు.
ముఖ్యమంత్రి గారు, మన ఇండస్ట్రీస్ మంత్రి గారు దావోస్ పర్యటించారు. రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారు.
ఈ పెట్టుబడులు సక్రమంగా ఉపయోగపడాలంటే ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. టాటాతో చర్చించి పాత 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చారు.
బీఆర్ఎస్ కాలంలో ఈ సెంటర్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.
కొత్తగా 53 ఏటీసీలు కూడా స్థాపించడం జరుగుతోంది. ఈ సెంటర్లలో కొత్త కోర్సులు, కొత్త పరిశ్రమలకు అవసరమైన ఏఐ, డ్రోన్ టెక్నాలజీ వంటి కోర్సులు ప్రవేశపెడుతున్నారు.
ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్‌లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏటీసీల్లో నేర్చుకుంటున్న ప్రతి విద్యార్థికి నెలకు రూ.2000 స్టైపెండ్ ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 2 నుండి ఇది అమల్లోకి రాబోతోంది.
దేశంలోనే తెలంగాణలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన శిక్షణను ఈ ఏటీసీల ద్వారా కల్పిస్తున్నాము.
అదేవిధంగా టామ్‌కామ్ ద్వారా యువకులకు విదేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాము.
బడ్జెట్‌లో రూ.90 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా భాషా శిక్షణ కోసం రూ.30 కోట్లు కేటాయించారు.
వచ్చే నెల టామ్‌కామ్ అధికారుల బృందం జర్మనీ పర్యటించనుంది. అక్కడ మన విద్యార్థులు, యువకులకు అవకాశాల కోసం అధ్యయనం చేస్తాము.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గిగ్ వర్కర్ల చట్టం కూడా తీసుకువస్తోంది. ఇది అసంఘటిత రంగంలో పని చేస్తున్న లక్షల మందికి మేలు చేస్తుంది. వారికి చట్టపరమైన భద్రత కల్పిస్తుంది.
రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్లకు ఇచ్చిన హామీ దృష్ట్యా ఈ చట్టాన్ని మన ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.
