Singareni: MLC Kavitha accuses BJP govt of conspiracy to closedown Singareni

సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బిజెపి ప్రభుత్వం పై ట్విట్టర్ లో ఎమ్మెల్సీ కవిత ఫైర్

బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతున్న సంస్థ సింగరేణి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సింగరేణిలో రాష్ట్రానికి 51%, కేంద్రానికి 49% వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోన్నదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి విరుద్దంగా ఉందని కవిత తెలిపారు. సీఎం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతితో, దేశంలోని ఇతర సంస్థల కంటే ఎంతో గొప్పగా లాభాలు సాధిస్తున్నదని కవిత పేర్కొన్నారు.

లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ, 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందని, సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం శ్రీ కేసీఆర్ గారు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఎమ్మెల్సీ కవిత అన్నారు. బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే వరకూ, కార్మికుల పక్షాన గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.