పాఠశాలలో పాము కాటుకు గురైన 3వ తరగతి విద్యార్థిని
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం చౌదరి గూడ మండలం పెద్ద ఎల్కిచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని అక్షిత పాము కాటు గురైన సంఘటన కలకలం రేపింది. టాయిలెట్ కు వెళ్లిన అక్షితను పాము మూడు కాట్లు వేసింది.
దీంతో చికిత్స నిమిత్తం అక్షితను ఆస్పత్రికి తరలించారు. అక్షిత ప్రమాదాని గురికావడంతో తోటి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఆ పాఠశాలలో పరిశుభ్రత లేదని టాయిలెట్లు చెత్తతో నిండిపోవడంతో దుర్గంధం, దుర్వాసన గా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.