RFCL లో స్వచ్ఛత పక్షోత్సవాలపై అవగాహన కార్యక్రమం…
రామగుండం: RFCL ఎరువుల కర్మాగారంలో మంగళవారం స్వచ్ఛత పక్షోత్సవాలలో భాగంగా ఉద్యోగులకు, కార్మికులకు.. పరిశుభ్రత, సంపన్నమైన, ఆరోగ్యకరమైన పరిశ్రమపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఫైర్ సేఫ్టీ, మెడికల్ డిపార్ట్మెంట్ వారికి వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ESIC రామగుండం నుండి డాక్టర్ అంజయ్య, బ్రాంచ్ మేనేజర్ డీకే రావు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో RFCLఅధికారులు, ఉద్యోగులు, కార్మికులు, ESIC నుండి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.