ఉక్రెయిన్ లో చిక్కుకున్న నిర్మల్ పట్టణానికి చెందిన వైద్య విద్యార్థి సాయి కృష్ణతో వీడియో కాల్ లో మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన వారిని సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం బుధవార్ పేట్ కు చెందిన పీజీ వైద్య విద్యార్థి సాయికృష్ణతో ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీడియో కాల్ లో మాట్లడారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రప్పించాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుందని వెల్లడించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని సాయికృష్ణకు మంత్రి ధైర్యం చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదని, సాయికృష్ణను క్షేమంగా ఇంటికి రప్పిస్తామని ఆయన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.