జాతీయ స్థాయి శిక్షణ కు “మాచన” సామాజిక బాధ్యత కు “కిరీటం”

జాతీయ స్థాయి శిక్షణ కు “మాచన”

సామాజిక బాధ్యత కు “కిరీటం”

పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ జాతీయ స్థాయి శిక్షణ కు ఎంపికయ్యారు. వీధి నిర్వహణ తో పాటు.. సామాజిక బాధ్యతతో.. రఘునందన్ పొగాకు నియంత్రణకు ఇరవై ఏళ్లుగా కృషి చేస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు కైవసం చేసుకున్నారు. తాజాగా రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రొల్ (చండీగఢ్), రఘునందన్ ను తమ ఆర్నెల్ల శిక్షణకు ఎంపిక చేసినట్లు తెలిపారు.

కేవలం నామ మాత్రపు రుసుముతో అడ్వాన్స్డ్ కోర్స్ ఇన్ టుబాకో కంట్రొల్ కు ఎంపికయ్యిన వారు దక్షిణ భారతం నుంచి రఘునందన్ ఒక్కరే. గత సంవత్సరం కూడా ఆర్ సీ టీ సీ నిర్వహించిన టుబాకో కంట్రోల్ బేసిక్ కోర్స్ కు పూర్తి స్థాయి ఉపకార వేతనంతో ఎంపికైన తెలుగు వ్యక్తిగా ఘనత దక్కించుకున్నారు.

అమెరికా, జర్మనీ, ఇంగ్లాడ్ తదితర దేశాల్లో జరిగిన పొగాకు నియంత్రణ సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు. రఘునందన్ కృషి నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కొనియాడింది. విధి నిర్వహణతో పాటే సామాజిక బాధ్యత కు రఘునందన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటం వల్లే , సమాజం లో గొప్ప పరిణామం ఆశించే వ్యక్తి గా రఘునందన్ కు శిక్షణ కు ఎంపిక చేసినట్లు ఆర్ సీ టీ సీ పేర్కొంది.