ప్రేయసి మోజులో భార్యకు HIV రక్తం ఎక్కించిన భర్త
ప్రేయసి మోజులో భార్యపై దారుణానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన చరణ్ ఐదేళ్ళ క్రితం యవతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో మరో యువతితో చరణ్‌కి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భార్యను వదిలించుకోవాలని RMP వైద్యుని సాయంతో ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు HIV వైరస్ ఎక్కించాడు. ఆ తర్వాత హెచ్ఐవీ వచ్చిందని, విడాకులు ఇవ్వాలని కోరడంతో భార్యకు అతని నిజస్వరూపం తెలిసింది. దీంతో తల్లిదండ్రులతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.