తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయనిధి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాల్లో నటించనని ఉదయనిధి ప్రకటించారు. రాజకీయాలతో బిజీ అవడం వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ” కమల్ హాసన్ సర్ బ్యానర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ దాన్నుంచి తప్పుకుంటున్నాను. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న మామన్నాన్ నా చివరి చిత్రం’ అని ఉదయనిధి చెప్పారు.