Bus Accident

ఆర్టీసీ బస్సు బోల్తా

తిరుపత్తూరు నుండి కుప్పం వస్తున్న ఆర్టీసీ బస్సు కొత్తయిండ్లు పంచాయతీ చందం గ్రామం సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడటంతో అతివేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపక్కనున్న ఖాళీ స్థలంలోకి దుసుకెళ్ళింది. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వటంతో క్షతగాత్రులను కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పక్కనే ఉన్న కరెంట్ స్థంబాన్ని ఢీకొని ఉంటే ఘోర ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు