cropped cp.jpeg
Latest

బీసీలకు 42% రిజర్వేషన్ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు జోరుగా స్టార్ట్!

whatsapp image 2025 11 19 at 9.14.22 pm

తెలంగాణ మంత్రివర్గం బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (బీసీ) సామాజిక వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎప్పటి నుంచో స్తంభించిపోయిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు మళ్లీ ప్రాణం పోసినట్లయింది.

ఈ నిర్ణయం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తుల ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి.
ప్రస్తుతం రిజర్వేషన్ల మొత్తం పరిమితిని 50 శాతంలోపు ఉంచుతూ ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ రెండు రోజుల్లోనే తుది నివేదిక సమర్పించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతం లోపు రిజర్వేషన్లు ఖరారు చేయడం ఈ కమిషన్ బాధ్యత. ఈ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల జాబితాను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంస్థకు అందజేయనున్నారు.
రిజర్వేషన్ జాబితా గెజిట్ నోటిఫికేషన్ పూర్తయిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ రావొచ్చని, డిసెంబర్ 25లోగా మూడు విడతల్లో పోలింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇప్పటి నుంచే ఎన్నికల బరిలో దూకేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.
గతంలో 34 శాతం మాత్రమే ఉన్న బీసీ రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచడం ద్వారా రేవంత్ రెడ్డి సర్కార్ తన మేనిఫెస్టో హామీని నెరవేర్చింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాల నుంచి విశేష స్వాగతం పొందుతోంది. త్వరలోనే పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలుకాబోతోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link