త్వరలో డిజిటల్ మీడియా పాలసీ: శాసన మండలిలో మంత్రి పొంగులేటి ప్రకటన
రాష్ట్రంలో డిజిటల్ మీడియాకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో, త్వరలోనే కొత్త డిజిటల్ మీడియా పాలసీను తీసుకురానున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. వచ్చే రెండు మూడు నెలల్లో ఈ పాలసీ అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
శాసన మండలిలో జర్నలిస్టుల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ కీలక విషయాలు చెప్పారు:
- జర్నలిస్టుల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు
- అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు
- అక్రిడేషన్పై వస్తున్న అపోహలు నిరాధారమని కొట్టిపారేశారు
- జర్నలిస్టుల సంఘాల సూచనలతో జారీ చేసిన జీ.ఓలో మార్పులు చేసినట్లు వివరించారు
- డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అనే తేడా ప్రభుత్వం చూడదని స్పష్టం చేశారు
అదే విధంగా, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి ఇప్పటికే ఈ అంశంపై స్పష్టత ఇచ్చారని, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా స్థలాల కేటాయింపుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
