సోషల్ మీడియాలో వేధింపులు: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కఠిన హెచ్చరిక
సోషల్ మీడియా వేదికలు ప్రజల దగ్గర చేసే సాధనాలైనా, కొందరు వాటిని దుర్వినియోగం చేస్తూ మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Instagram, Facebook, WhatsApp, Telegram వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మహిళలపై అసభ్యకర కామెంట్లు, వేధింపులు పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
డీసీపీ సాయి మనోహర్ ఆగ్రహం
సాయి మనోహర్ మాట్లాడుతూ..
సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలకుండా అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు
తెర వెనుక దాక్కొని కామెంట్లు చేస్తున్న వారిని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తున్నాం అని స్పష్టం చేశారు
మైనర్ల పాత్రపై ఆందోళన
వేధింపులకు గురవుతున్న వారిలో మైనర్లు కూడా ఉండటం ఆందోళనకరమని తెలిపారు
అలాంటి వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నాం అని చెప్పారు
తల్లిదండ్రులకు సూచనలు
పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని సూచించారు
మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు
కఠిన చర్యల హెచ్చరిక
ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చినా మారకపోతే, మళ్లీ మళ్లీ తప్పు చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరిక
👉 సోషల్ మీడియాను బాధ్యతతో ఉపయోగించాలి. ఇతరులను అవమానించే వ్యాఖ్యలు న్యాయపరమైన సమస్యలకు దారి తీస్తాయని పోలీసులు స్పష్టం చేశారు.
