జర్మనీలో తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు… హనోవర్‌లో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి కీలక చర్చలు
హనోవర్, ఏప్రిల్ 7: తెలంగాణ కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి జర్మనీ పర్యటనలో భాగంగా హనోవర్‌లో జర్మన్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అధికారులతో మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను విస్తరించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.
తెలంగాణ నుంచి జర్మనీకి నైపుణ్యంతో కూడిన మానవ వనరుల పంపిణీపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా జర్మనీలో నైపుణ్యం కలిగిన యువత ఉన్న రంగాలను గుర్తించి, అవసరాలకు అనుగుణంగా తెలంగాణను సిద్ధం చేసే మార్గాలపై దృష్టి సారించారు. జర్మన్ ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య ప్రమాణాలు, భాషా శిక్షణ, అంతర్జాతీయ సర్టిఫికేషన్ ప్రక్రియలపై సమగ్ర సమీక్ష జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం యువతను గ్లోబల్ స్థాయిలో పోటీకి సిద్ధం చేయడానికి తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ద్వారా ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తూ, విదేశీ ఉద్యోగావకాశాలకు అనుసంధానం అని తెలిపింది.
ఈ ప్రతినిధి బృందంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (LETF) ఎం. దానా కిషోర్, టామ్‌కామ్ జనరల్ మేనేజర్ నాగభారతి, మేనేజర్ అనిల్ కుమార్, పీఎంయూ హెడ్ శ్రీనివాస్ రావు, స్కిల్ టాలెంట్ అక్విజిషన్ హెడ్ బాలా రమణి నిర్వహించారు.
సమావేశం సందర్భంగా జర్మన్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీలో ఎర్లీ కెరీర్ కౌన్సెలింగ్ విభాగం అధిపతి లారా బ్రెయిట్సామీటర్ను మంత్రి మరియు ప్రతినిధి బృందం సన్మానించారు.
ఈ చర్చలు తెలంగాణ యువతకు జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కీలక మార్గాలను ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన ముందడుగుగా ఉంది.
