టాంకామ్ ద్వారా విదేశీ ఉద్యోగాలకు బాటలు – యువతకు భారీ అవకాశాలుజర్మనీలో లక్షల ఉద్యోగాలు… గిగ్ వర్కర్స్ యాక్ట్ దేశానికి ఆదర్శం
మంచిర్యాల, ఏప్రిల్ 15: రాష్ట్ర యువతకు విదేశాల్లో విస్తృతమైన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
జర్మనీ దేశంలో ప్రతి ఏడాది సుమారు 5 లక్షల ఉద్యోగాల అవసరం ఉంది, ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం 90 వీసాలు జారీ చేయడానికి ఆ దేశం ముందుకు వచ్చిందని. ఈ అవకాశాలను తెలంగాణ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ATCs) ద్వారా ప్రతి సంవత్సరం 25 వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించామని తెలిపారు. దాదాపు ప్రభుత్వం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. TOMCOM ద్వారా కేవలం నాలుగు నెలల్లోనే జర్మన్ భాష శిక్షణ కూడా ఇచ్చారు. చెన్నూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు.
ప్రైవేట్ ఏజెన్సీల మాయమాటలకు లోనై మోసపోవద్దని యువతను మంత్రి హెచ్చరించారు. విదేశాల్లో, ముఖ్యంగా జర్మనీలో భారతీయ యువతకు మంచి అవకాశాలు ఉన్నాయి, అక్కడి చట్టాలను గౌరవిస్తూ కష్టపడి పనిచేసే స్వభావం వల్ల భారతీయులకు మంచి పేరు ఉంది. జర్మనీలో ఉద్యోగాల ద్వారా నెలకు రూ.2 లక్షలకు పైగా వేతనాలు పొందే అవకాశం ఉందని చెప్పారు.
రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి దక్కుతుందని మంత్రి ప్రకటించారు.
అదేవిధంగా, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గిగ్ వర్కర్స్ యాక్ట్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
