హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్ఎంసీ చర్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 18:
నగరంలో ఫుట్‌పాత్‌లపై జరుగుతున్న ఆక్రమణలను తొలగించేందుకు గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. రాజేంద్రనగర్ నుంచి శివరాంపల్లి, ఆరాంఘర్ వరకు పక్కన ఉన్న ఫుట్‌పాట్‌లపై ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం (ఏప్రిల్ 18) రంగంలోకి దిగిన అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఫుట్‌పాత్‌ల ఆక్రమణల వల్ల పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఫుట్‌పాత్‌లను ఖాళీగా ఉంచడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ఇకపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను ఉల్లంఘించి ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమాలను ఎటువంటి ఉపేక్ష లేకుండా కూల్చివేస్తామని అధికారులు తెలిపారు.
