ఇన్స్టాగ్రామ్ వేదికగా మైనర్ బాలికల టార్గెట్… షీ టీమ్స్ చేతిలో కిరాతక ముఠా భండాఫోర్
హైదరాబాద్:
ఈ సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు సాగుతున్న భారీ సైబర్ మోసాన్ని హైదరాబాద్ షీ టీమ్స్ ఛేదించారు. జూబ్లీహిల్స్ కేంద్రంగా Instagram వేదికగా మైనర్ బాలికలను వలలో వేసుకుంటున్న ఒక కిరాతక ముఠాను పట్టుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, విదేశాల్లో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు, ముఖ్యంగా ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న మైనర్ బాలికలే ఈ ముఠా ప్రధాన లక్ష్యం. సోషల్ మీడియాలో విలాసవంతమైన జీవితం, పార్టీల ఫోటోలు చూపిస్తూ ఫేక్ ఇమేజ్ సృష్టించి, మొదట స్నేహం పెంచుకుంటారు. అనంతరం బాధితుల నుంచి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించి, వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తారు.
ఈ మోసంలో మరో షాకింగ్ అంశం, బాధితుల కదలికలను వారి ఇళ్లలో పనిచేసే పనిమనుషులను కూడా ఉపయోగించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి ద్వారా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్థితి వంటి కీలక సమాచారం సేకరించి పక్కా ప్రణాళికతో మోసాలకు పాల్పడుతున్నారు.
ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురిని లక్ష్యంగా చేసుకుని భారీగా డబ్బు దోచుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన హైదరాబాద్ షీ టీమ్స్ పోలీసులు సాక్ష్యాధారాల ఆధారంగా గ్యాంగ్ కీలక సభ్యుడు అర్జున్ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన సభ్యుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పోలీసులు తల్లిదండ్రులకు, విద్యార్థులకు అప్రమత్తంగా ఉండాలని సూచించడం, సోషల్ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు.
