ఆధార్‌పై UIDAI కీలక క్లారిటీ.. ఉచిత బస్ పథకాల్లో మాత్రం గందరగోళం!
ఆధార్ కార్డు వినియోగదారులకు భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక స్పష్టత ఇచ్చింది. ఆధార్ లెటర్, ఈ-ఆధార్, PVC ఆధార్ కార్డు, అలాగే mAadhaar మొబైల్ యాప్‌లో చూపించే డిజిటల్ ఆధార్.. ఇవన్నీ సమానంగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలేనని వెల్లడించింది.
ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర సంస్థలు ఈ అన్ని రూపాల ఆధార్‌లను అధికారిక గుర్తింపు పత్రాలుగా అంగీకరించాలని UIDAI సూచించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రజలు మొబైల్‌లో ఆధార్ చూపించినా దాన్ని చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్‌గా పరిగణించాల్సిందేనని స్పష్టం చేసింది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు అమలవుతున్న ఉచిత బస్ ప్రయాణ పథకాల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సుల్లో ప్రయాణించే మహిళలను కొన్ని చోట్ల ఫిజికల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలని సిబ్బంది అడుగుతున్నారని ప్రయాణికులు చెబుతున్నారు.
ఫోన్‌లో mAadhaar యాప్ లేదా ఈ-ఆధార్ చూపించినా అనుమతించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డిజిటల్ ఆధార్‌ను అధికారికంగా చెల్లుబాటు అయ్యేదిగా ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదన్న చర్చ మొదలైంది.
ప్రయాణికులు మాత్రం “UIDAI అన్ని రూపాల ఆధార్‌ను చెల్లుబాటు అయ్యేదిగా చెబితే, ఉచిత బస్ పథకాలలో కూడా డిజిటల్ ఆధార్‌ను అనుమతించాలి” అని ప్రభుత్వాలను కోరుతున్నారు. ఈ అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
