నిమ్స్‌లో తూంకుంట నర్సారెడ్డికి పరామర్శ
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: తూంకుంట నర్సారెడ్డి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పురోగతిపై వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
అనంతరం నర్సారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. నర్సారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు. అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
