ఘట్కేసర్ సీఐ బాలస్వామి సస్పెన్షన్?
సివిల్ వివాదాల్లో జోక్యం, అవినీతి ఆరోపణలు.. సీపీ ఆదేశాలతో విచారణ
హైదరాబాద్, అక్టోబర్ 15: ఘట్కేసర్ సీఐ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, అవినీతి వ్యవహారాలు, విధి నిర్వహణలో అలసత్వానికి సంబంధించి ఆయనపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాల సమాచారం.
విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో బాలస్వామిని సస్పెండ్ చేసినట్లు అంతర్గత సమాచారం వెలువడింది. అయితే, ఈ సస్పెన్షన్పై పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. దీంతో సస్పెన్షన్కు సంబంధించిన వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, గతంలో ఘట్కేసర్ సీఐగా పనిచేసిన మరో అధికారి కూడా దసరా పండుగ సమయంలోనే సస్పెన్షన్కు గురికావడం గమనార్హం. తాజాగా బాలస్వామిపై సస్పెన్షన్ వార్తలు వెలువడటంతో పోలీసు వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉండటంతో సస్పెన్షన్కు సంబంధించిన వివరాలను పోలీసు శాఖ ప్రకటన తర్వాత నిర్ధారించాల్సి ఉంది.
