కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల భవనం ప్రారంభం
విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడమే లక్ష్యం
ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
నాగర్ కర్నూల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని దేశిటిక్యాల గ్రామంలో నూతన పాఠశాల భవనం అందుబాటులోకి వచ్చింది. ఎంపీ మల్లు రవి నిధుల నుంచి రూ.కోటి వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనాన్ని ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించేందుకు మెరుగైన మౌలిక వసతులు అవసరమన్నారు. నూతన భవనంతో విద్యార్థులకు సౌకర్యవంతమైన తరగతి గదులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునీందర్, వైస్ చైర్మన్ బాదం రమేష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నిరంజన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కా రాజు, మాజీ వార్డు కౌన్సిలర్ అమృతమ్మ, అచ్యుత రెడ్డి, కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పద్మ, నిజాం, పడిగే శంకర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
