వివాహేతర సంబంధం.. రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య
భర్తతో గొడవల నేపథ్యంలో ప్రియుడితో కలిసి మహిళ బలవన్మరణం
మండ్య: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. భర్తతో గొడవల నేపథ్యంలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో చోటుచేసుకుంది.
బెంగళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరేశ్‌ను సహన ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో సహనకు ర్యాపిడో బైక్ డ్రైవర్ రాహుల్‌తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం. ఈ విషయం భర్త వీరేశ్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాహుల్‌తో కలిసి మండ్యకు చేరుకున్న సహన.. ఇండువాల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
