ఉప్పల్ మెట్రో స్టేషన్లో పోలీసుల భద్రతా మాక్ డ్రిల్
అవాంఛనీయ ఘటనలను ఎదుర్కొనేందుకు పోలీసుల సంసిద్ధత పరీక్ష
ఉప్పల్: ఉప్పల్ మెట్రో స్టేషన్లో మల్కాజిగిరి పోలీసులు భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉప్పల్ ఏసీపీ ఆధ్వర్యంలో ఉప్పల్ పోలీసు సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రో స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అత్యవసర పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నప్పుడు తక్షణమే స్పందించి సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసుల సంసిద్ధతను పరీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టే విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
