అంబరాన్నoటిన బతుకమ్మ సంబరాలు
హన్మకొండ : గీతాంజలి మహిళా కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 5వ రోజు అన్నపూర్ణ దేవి అలంకరణ లో భాగంగా అటుకుల బతుకమ్మను పిల్లలందరూ అందంగా పేర్చి ఆనందోత్సవాలతో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ప్రతి ఆడపిల్ల ఆది శక్తికి ప్రతీకలుగా అమ్మవారిని పేర్చి ఆటపాటలతో కొలిచారు . ఈ సంబరాలలో భాగంగా కళాశాల డైరెక్టర్ వేణు మాధవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో అతి ప్రాచీనమైన, సాంప్రదాయపు పండుగ బతుకమ్మ అని, బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు విజయానికి ప్రతీకగా, విరోచిత పోరాటానికి నిదర్శనంగా, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రంగు రంగుల పూలతో చేసుకునే ఆసియా లోనే అతి పెద్ద పూల పండుగ అని అన్నారు . ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీధర్ , ప్రిన్సిపాల్ మంజులా దేవి అధ్యాపక బృందం పాల్గొన్నారు.