శాంతిభద్రతలకు సహకరించాలి: బెల్లంపల్లి ఏసీపీ ఏడ్ల మహేష్
అనవసరంగా క్షణిక ఆవేశం లో కేసుల పాలై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఆర్మీ ఉద్యోగాలకు ఎన్నికైన, ప్రయత్నం చేస్తున్న 45 మంది యువకులకు బెల్లంపల్లి ఏసీపి ఏడ్ల మహేష్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ… శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ప్రజా జీవనానికి భంగం కలిగినా, ఆస్తులను ధ్వంసం చేసినా చట్ట ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామన్నారు. వివిధ ఉద్యోగాలకు ప్రభుత్వం ప్రకటనలు వస్తున్నాయని, యువత లక్ష్యసాధనకు చదువుకోవాలన్నారు. అల్లరులు, విద్వాంసం లకు పాల్పడేవారు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కంటే జీవితం అంధకారంగా మారుతుందన్నారు. పూకార్లను నమ్మవద్దని, సామానిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేసినా కఠినచర్యలు తప్పవని అన్ని సామాజిక మాధ్యమాలపై పోలీస్ నిఘా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో యువత ఉద్యోగాలకు సిద్ధంకావాలన్నారు. అల్లర్లు, నిర్వంసాలకు పాల్పడే వారు ఎలాంటి పరిస్థితిలో తప్పించుకోలేరని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ ప్రమోద్ రావు, బెల్లంపల్లి రూరల్ సీఐ బాబు రావు, బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ రాజు, ఎస్ఐ లు తదితరులు పాల్గొన్నారు.