Inauguration ceremony of BRS party central office in Delhi

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం

ఈనెల 14న దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించి యాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవం, యాగం కోసం చేపట్టవలసిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌ ఆదివారం పరిశీలించారు.

యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనంలో చేపట్టవలసిన మరమ్మత్తులు, కార్యాలయ ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు.