17 Khelo India centers sanctioned to Telangana

తెలంగాణకు 17 ఖేలో ఇండియా సెంటర్లు మంజూరు

గత ఆరు నెలల నుండి, తెలంగాణ రాష్ట్రానికి, ఖేలో ఇండియా సెంటర్లు, వివిధ క్రీడా అంశాలలో, మంజూరు చేయాలని, దరఖాస్తులు చేసుకున్న సందర్భంగా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ, 17 ఖేలో ఇండియా సెంటర్లను తెలంగాణ కు మంజూరు చేస్తూ… ఉత్తర్వులను జారీ చేశారు.

తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కు, 34 ఖేలో ఇండియా సెంటర్లు మంజూరు చేయగా తెలంగాణకు 17 ఖేలో ఇండియా సెంటర్లు మంజూరు అయ్యాయి.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని, యువతీ యువకులు, క్రీడల్లో గొప్పగా ఎదిగి, భారత దేశానికి ప్రాతినిధ్యం వహించాలని, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా, ఇపుడు ఈ 17 క్రీడా ఖేలో ఇండియా సెంటర్లను, త్వరలో ప్రారంభించుకుని, శిక్షణ ప్రారంభించాలని, రాష్ట్ర మాజీ స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి కోరారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, దేశంలోనే అన్ని రాష్ట్రాలలోకెల్ల, అత్యుత్తమమైన స్పోర్ట్స్ పాలసీ ని తీసుకొచ్చి, క్రీడా అకాడమీలతో పాటు, గ్రామీణ క్రీడాకారులకు పెద్ద పీట వేసి, ఒలంపియన్లుగా తీర్చిదిద్దబోతుందని, రాష్ట్ర మాజీ స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తెలియజేశారు.