ఆశావహులకు తీపికబురు.. స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) వేగంగా కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలో పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాను మరోసారి సవరించేందుకు షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ఇవాళ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో రేపటి నుంచి నవంబర్ 23 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. ఈ నాలుగు రోజుల్లో గ్రామాల్లో ఓటర్ల జాబితాలను ఇంటింటి స్థాయిలో పరిశీలించి, కొత్తగా అర్హత సాధించినవారి పేర్లు చేర్చడం, మరణించిన వారి…

