Corporate education for workers children: DCP Rupesh

ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య: డీసీపీ రూపేష్

ఇటుక బట్టిల్లో పని చేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా ఆపరేషన్ ధ్రువ ప్రాజెక్టు పేరుతో ధృవ పాఠశాలలు ప్రారంభించినట్లు పెద్దపల్లి డీసీపీ రూపేష్ పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం గౌరెడ్డి పేట ఇటుక బట్టి లో ధృవ పాఠశాలను పెద్దపెల్లి డీసీపీ రూపీస్ ఐపీఎస్ పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ…. వలస కార్మికులు పొట్ట కోటి కోసం స్వరాష్ట్రం వదిలి ఇటుక బట్టీ లలో పని చేసేందుకు వచ్చారని, కార్మికులతో పాటు వారి పిల్లలు విద్యాభ్యాసం మాని బట్టిల్లో పని చేయడం సరికాదన్నారు. వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని యజమానులతో మాట్లాడి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని ధృవ పాఠశాలలు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, సిఐ లు ప్రదీప్ కుమార్, ఇంద్ర సేనా రెడ్డి, అనిల్ కుమార్, ఎస్ఐ లు రాజేష్, శ్రీనివాస్, మౌనిక, బట్టి యజమానులు ప్రదీప్, వెంకన్న, శ్యామ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.