cropped cp.jpeg
Latest

పోలీసుల అదుపులో నకిలీ అనిశా అధికారి?

whatsapp image 2025 11 29 at 10.45.28 am

ఎవరైనా ప్రభుత్వ అధి కారి లేదా ఉద్యోగి లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కితే మరుసటి రోజు ఇతడు రంగంలోకి దిగుతాడు. అనిశాకు చిక్కిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ ఫోన్లు చేస్తూ అనిశా పేరుతో బెదిరింపులకు, భయభ్రాంతులకు గురి చేసి అందినంత దండుకుంటాడు. గత నెలలో ఆర్టీఏ కార్యాలయంలో పనిచేసే ఎంవీఐకి ఫోన్ చేసి అనిశా అధికారినంటూ బెదిరింపులకు పాల్ప డ్డాడు. అతని మాటలకు భయపడి అడిగినంత నగదును అజ్ఞాత వ్యక్తి చెప్పిన ఖాతాల్లోకి మళ్లిం చాడు. దీనిపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కొన్నేళ్లుగా నకిలీ అనిశా అధికారి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలువురు ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేసి రూ. లక్షల్లో దండుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link