అగ్ని ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు…. పెద్దపల్లి స్టేషన్ అగ్ని మాపక అధికారి

పెద్దపల్లి పట్టణంలో ఆసుపత్రులు, పాఠశాలలో తనీఖీలు

అగ్ని ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని , అగ్ని ప్రమాదాల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి స్టేషన్ అగ్ని మాపక అధికారి డి. శ్రీనివాస్ అన్నారు.

మంగళవారం పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ మల్లికార్జున, శ్రీ తిరుమల ఆసుపత్రులలో పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది తనిఖీ నిర్వహించి ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాల నియంత్రణకు ఏర్పాటు చేసిన జాగ్రత్తలను పరిశీలించారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అగ్ని ప్రమాదాల నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలోని ఆసుపత్రులు, పాఠశాలలు, ముఖ్యమైన వాణిజ్య సంస్థలలో తనిఖీలు నిర్వహించి అగ్ని ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలిస్తూ సంబంధిత వారికి జాగ్రత్తలను వివరించడం జరిగిందని తెలిపారు.పెద్దపల్లి పట్టణంలో ఇప్పటివరకు శ్రీజ, శ్రీదేవి, శ్రీ శ్రీనివాస మెటర్నరీ హోమ్ ఆసుపత్రులను తనిఖీ చేశామని, మంగళవారం రోజు శ్రీతిరుమల, శ్రీమల్లికార్జు న ఆసుపత్రులను పరిశీలించామని తెలిపారు.

అగ్ని ప్రమాదాల నియంత్రణకు అవసరమైన పరికరాలు నిబంధన మేరకు ఆసుపత్రిలో అందుబాటులో లేనందున అదనంగా మరో మూడు ఫైర్ ఎక్సిటిన్గ్యూషర్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించామని, అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అగ్నిమాపక నియంత్రణ పరికరాలను వినియోగించాల్సిన తీరుపై అక్కడి సిబ్బందికి అవగాహన కల్పించామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి స్టేషన్ అగ్ని మాపక సిబ్బంది పి. మహేందర్ రెడ్డి, చంద్రయ్య, కే.శ్రీనివాస్, ఎం. ప్రవీణ్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.