కొండా సురేఖ శ్రీశైలం ఆలయ సందర్శనం – కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు
ఈ రోజు ఉదయం శ్రీశైలం లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కూతురు సుష్మితా పటేల్, మనవడు కొండ శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్‌తో కలిసి ఆలయానికి వచ్చిన మంత్రి కుటుంబానికి పూజారులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ గారు తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ మల్లికార్జున స్వామి వారి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య మంత్రి కుటుంబానికి వేదాశీర్వచనం అందించారు.
ఈ కార్యక్రమంలో ఈ ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు మంత్రి సురేఖ గారికి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.
తమ కూతురుతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. కుటుంబంపై శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మనవరాలు శ్రేష్టా పటేల్, మనవడు కొండా శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
