ఉత్తరకాశీ జిల్లాలోని మౌంట్ ద్రౌపది కా దండా – II శిఖరం వద్ద మంగళవారం మంచుచరియలు విరిగిపడి 10 మంది పర్వతారోహకులు మరణించారని అధికారులు తెలిపారు.
నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం) కు చెందిన 34 మంది ట్రైనీ పర్వతారోహకులు, 7 గురు బోధకులు తిరిగి వస్తుండగా హిమపాతంలో చిక్కుకున్నారని ఎన్ఐఎం ప్రిన్సిపల్ కల్నల్ అమిత్ బిష్త్ తెలిపారు.10 మృతదేహాలు కనిపించాయని, అందులో 4 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.