cropped cp.jpeg

కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. 20 బొమ్మల దుకాణాలు దగ్ధం.. కోటి రూపాయల ఆస్తి నష్టం

screenshot 2025 11 30 173250

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (నవంబర్30) తెల్లవారు జామున గుట్ట కింద ఉన్న బొమ్మల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి పక్క దుకాణాలకు అంటుకోవడంతో 20 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పారు.

ఈ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *