వాల్తేరు వీరయ్య నుంచి సాంగ్ బిట్ లీక్ చేసిన చిరుటాకీస్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. తాజాగా ఈ మూవీ నుంచి చిరు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి చిరు–శ్రుతి హాసన్ కాంబినేషన్ లో ఒక పాటను చిత్రీకరించారు. ఆ పాటకి సంబంధించిన లోకేషన్ వీడియో, పాటకు సంబంధించిన చిన్న బిట్ ను చిరు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
https://www.instagram.com/reel/CmJdL8XJIaP/?igshid=NDk5N2NlZjQ=
హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నా. ఈ నెల 12న శృతిహాసన్‌తో నేను చేసిన పాట పూర్తయిపోయింది. విజువల్స్, సాంగ్ చాలా ఎక్జయిటింగ్ అనిపించింది..మేం షూట్ చేసిన లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి.. త్వరలో లిరికల్ వీడియో మీ ముందుకు రాబోతుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు లీక్ చేస్తున్నా.. ఎవరికీ చెప్పకండీ” అంటూ నువ్వు శ్రీదేవైతే.. అనే సాంగ్ బిట్‌ను చిరు షేర్ చేశారు.దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. మైత్రీవారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రవితేజ పోర్షన్ ను ముగించే పనిలో ఉన్నారు.