జపానీ భాష నేర్చుకుంటున్న విద్యార్థులను సందర్శించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్ మాదాపూర్‌లోని Career Consultz సంస్థలో జపానీ భాష శిక్షణ పొందుతున్న జపాన్‌లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు జపానీ భాషను అభ్యసిస్తున్న విద్యార్థులతో రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు సమావేశమయ్యారు.
విద్యార్థుల అభ్యాస పురోగతిని తెలుసుకుని, భాషా నైపుణ్యాలతో పాటు క్రమశిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కూడా మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి విదేశీ భాషలపై పట్టు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
జపానీ భాషలో ప్రావీణ్యం సాధించి జపాన్‌లో ఉన్నత ఉద్యోగాలు పొందాలని విద్యార్థులకు మంత్రి ఆకాంక్షించారు. యువత భవిష్యత్తుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు.
