ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం షాక్‌

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ షాకిచ్చింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్‌ బకాయిలను చెల్లించే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా సంక్షోభం సమయం, 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డియర్‌నెస్ అలవెన్స్ పెండింగ్‌లో ఉంది. ఈ DAను చెల్లించే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో క్లారిటీ ఇచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా పరిస్థితులు అంతంత మాత్రం గానే ఉన్నాయంది. కాగా డియర్‌నెస్ అలవెన్స్‌ నిలిపివేత ద్వారా ప్రభుత్వానికి రూ.34,000 కోట్లు ఆదా అవుతుందని సమాచారం.