Patel Enterpreneur Network- ఘనంగా జరిగిన పటేల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు
పటేల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మూడవ సదస్సు బోయిన్ పల్లిలోని ఓసిమం ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఘనంగా జరిగింది. సదస్సుకు ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ వేదుల వెంకటరమణ, ఓసిమం ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ శ్రీ సీఎం ప్రకాష్ పాల్గొన్నారు. ముఖ్య అతిధులు వారి అనుభవాలను, సమాజానికి, కులానికి ప్రతి ఒక్కరూ ఏవిధంగా ఉపయోగపడాలో వివరించారు.
కుల ప్రముఖులు అపోలో ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ చెన్నంచెట్టి విజయ్ కుమార్, నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ శ్రీ మార్గం ఆదిత్య, పారిశ్రామికవేత్త శ్రీ రౌతు కనకయ్య పటేల్, సీతాఫల్మండి మాజీ కార్పొరేటర్ శ్రీ ఆదం విజయకుమార్, తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కాటo సునీల్ కుమార్, మార్షల్ ఆర్ట్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ బోడె సాయి దీపక్ పటేల్, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ డి టి వెంకటస్వామి, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుశీల్ సిరిగిరి ప్రముఖ న్యాయవాది శ్రీ లవంగాల అనిల్ కుమార్, లయన్ ఇంటర్నేషనల్ అనిత గాలి, గణిత శాస్త్ర ఆచార్యులు శ్రీ ముత్యాల రవీందర్, జర్నలిస్ట్, ప్రముఖ గాయని మాళవిక ఆనంద్ తండ్రి శ్రీ వివేకానంద, శ్రీ దండు నాగరాజు, ఆత్మీయ పటేల్ బిల్లకంటి శ్రీనివాస్ పటేల్, మున్నూరు కాపు పటేల్ హేమాహేమీలు హాజరయ్యారు.

సమన్వయకర్తలుగా డాక్టర్ ఎల్ ఎన్ పటేల్, శ్రీ బేతి శ్రీధర్ పటేల్, శ్రీ తెల్ల మురళీధర్ పటేల్, శ్రీ విక్రమ్ సిలిగిరి పటేల్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

సదస్సుకు బ్రేక్ ఫాస్ట్ టీ స్నాక్స్ అందించిన దాతలకు ఫోటోగ్రఫీ అందించిన పటేల్ సోదరుడికి, ఎంతో ఉన్నత మనసుతో తమ స్కూల్ ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహరణకు అనుమతి ఇచ్చిన ఓసిమం ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి, ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన ప్రతి పటేల్ సోదరులకు PEN ధన్యవాదాలు తెలిపింది