DPS Full fees-Nil Classes

త‌ర‌గ‌తులు నిల్… ఫీజులు మాత్రం ఫుల్… ఘట్ కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నిర్వాకం

మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ లో ఫిర్యాదు

కరోనా మ‌హ‌మ్మారి కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. పాఠశాలలు పనిచేయకున్నా.. విద్యార్థులకు తరగతులు నిర్వహించకున్నా… కొన్ని పాఠశాలల యాజమాన్యాలు పూర్తి ఫీజులను వసూలు చేస్తున్నాయి. పాఠశాలల యాజమాన్యాలు వార్షిక ఫీజులను కాకుండా, కేవలం నెలవారీ ట్యూషన్ ఫీజులను మాత్రమే వసూలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పినా…హైదరాబాద్ శివార్లలో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో పేరున్న పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆన్‌లైన్ త‌రుగతులు నిర్వ‌హించిన‌ప్పుడు.. ఫీజు క‌డుతారా.. లేదంటే ఆన్‌లైన్ క్లాసుల లింక్‌ కట్‌ చేయమంటారా.. అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్ర‌వేట్ స్కూల్స్ యాజ‌మాన్యాలు హెచ్చ‌రించిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు. తాము చెప్పిన చోటే పుస్తకాలు కొనాలని, షరతులు విధించడం లేదంటే పాఠశాలలోనే బిల్లు చెల్లించాలని చెప్పార‌ని కూడా ఆరోపణలు ఉన్నాయి.

గత నెలరోజులగా ఫీజుల వసూళ్లపై కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలు దృష్టి సారించారు. మెస్సెజ్‌లు పెడుతూ, నేరుగా ఫోన్‌లో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఇదే తరహాలో… ఘ‌ట్‌కేస‌ర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజ‌మాన్యం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుంద‌నీ.. త‌ర‌గతులు నిర్వ‌హించ‌కున్నా.. ఫీజులు చెల్లించాల‌ని ఒత్తిడి చేస్తుంద‌ని, అంతే కాకుండా సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయ‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఓ విద్యార్థి తండ్రి తన‌ భాదను, స‌ద‌రు విద్యాసంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి ట్విట‌ర్ వేదిక‌గా రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు.