Peddapalli : Vehicles seize

నంబర్ ప్లేట్లు లేని 45 వాహనాల సీజ్

Peddapalli: నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 45 వాహనాలను పెద్దపల్లి పోలీసులు సీజ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి.. నంబర్ ప్లేట్లు లేకుండా సంచరిస్తున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


ఈ సందర్భంగా ఏసిపి సారంగపాణి మాట్లాడుతూ…. నిబంధనల ప్రకారం వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు ముందు, వెనుక వైపు నంబర్ ప్లేట్ కలిగి ఉండాలన్నారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని నంబర్ ప్లేట్ లేకున్నా, వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలను సీజ్ చేస్తామని రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ లు రాజేష్, రాజ వర్ధన్, వెంకట కృష్ణ, సహదేవ్ సింగ్, మౌనిక, శివాని, అశ్వినితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.