దివ్యాంగులకు అండగా తెలంగాణ ప్రభుత్వం: జడ్పీ చైర్మన్ పుట్ట మధు
పెద్దపల్లి :- తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. గురువారం రోజున జడ్పీ కార్యాలయంలో*కేంద్ర ప్రభుత్వం పించన్ వాటా రూ.3 వేలకు పెంపు.. ఉద్యోగ రిజర్వేషన్లు 4% దేశవ్యాప్తంగా అమలు.. రాజకీయ రిజర్వేషన్ల సాధనకై దివ్యాంగుల చలో ఢిల్లీ జాతీయ సదస్సు NPRD INDIA అనే వాల్ పోస్టర్ ను జడ్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో NPRD INDIA జిల్లా మహిళా అధ్యక్షురాలు సూగురి స్వప్న, దివ్యాంగుల నాయకులు రాజేందర్, డేగ రజిత, రాజేశ్వరి పాల్గొన్నారు.